'ఆడబిడ్డ నిధి' పథకంపై ప్రభుత్వం కసరత్తు!

AP: కూటమి ప్రభుత్వం తమ సూపర్‌ సిక్స్ పథకాలలో కీలకమైన 'ఆడబిడ్డ నిధి' పథకాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ పథకం కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుకానుంది. ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున, ఏడాదికి రూ.18,000 వారి ఖాతాల్లో జమ చేస్తారు. ఈ పథకానికి బడ్జెట్‌లో రూ.3,300 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. దీని కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను కూడా రూపొందిస్తున్నట్టు సమాచారం.

సంబంధిత పోస్ట్