AP: 'ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. అంటే, అర్హులైన మహిళలను గుర్తించడం, వారి ఆధార్‌తో బ్యాంక్ ఖాతాలను అనుసంధానం చేయడం వంటి కీలక ప్రక్రియలు జరుగుతున్నాయి. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.