'ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు

AP: 'ఆడబిడ్డ నిధి' పథకం అమలుపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 అందించనుంది. ఈ పథకాన్ని ఒకేసారి కాకుండా దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. లబ్ధిదారుల డేటా పరిశీలన, బ్యాంక్ లింకేజీ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. మొదటి విడత నిధుల విడుదల తేదీని ప్రభుత్వం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్