ఆలయాల పరిరక్షణ, ప్రక్షాళనకు ప్రభుత్వం కృషి: హోంమంత్రి అనిత

AP: శ్రీ వరాహలక్ష్మీ నరసింహ స్వామివారిని హోంమంత్రి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో హోంమంత్రికి దేవాలయ అధికారులు స్వాగతం పలికారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆలయాల పరిరక్షణ, ప్రక్షాళనకు నడుం బిగించినట్లు చెప్పారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహించామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్