గతంలో తనకున్న సెక్యూరిటీని కొనసాగించాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ సీఎం జగన్ అందులో కీలక విషయాలు పొందుపర్చారు. తనను అంతమొందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యంగా పెట్టకుందని ఆయన ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉన్న అంశాన్ని పరిశీలించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందన్నారు. గతంలో ఉన్న సెక్యూరిటీని కొనసాగించేలా ఆదేశాలు జారీ చేయాలని జగన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.