AP: తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాలో రూ.13 వేలు జమ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ స్కీమ్ ఎవరికి వర్తిస్తుందో, అర్హులో కాదో తెలుసుకోవడం ఎలా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. bm-sgsw.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ‘స్కీమ్ ఎలిజిబిలిటీ’పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి. స్కీమ్ టైప్‌లో తల్లికి వందనం సెలక్ట్ చేసుకోవాలి. వివరాలు, ఓటీపీ ఎంటర్ చేస్తే లబ్ధిదారు సమాచారం కనిపిస్తుంది. అందులో ఏమైనా తప్పులుంటే సచివాలయాల్లో సంప్రదించాలి.