ఎల్లుండి నుంచి గ్రూప్1 అప్లికేషన్లు

ఏపీలో 163 గ్రూప్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 6 నుంచి 27వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. APPSC ఇప్పటికే అభ్యర్థులను తమ OTR (One Time Registration) వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. అయితే, డీఎస్పీ (కమ్యూనికేషన్స్) పోస్టులకు బీఈ లేదా బీటెక్ అర్హత తప్పనిసరి. మరిన్ని వివరాలకు https://portal-psc.ap.gov.in/ ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕