AP: ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు మంగళవారం విడుదల అయ్యాయి. జూన్ 3 నుంచి 30 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని ఏపీపీఎస్సీ వెల్లడించింది. మే 3 నుంచి 9వ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు 4వేల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. ఏపీపీఎస్సీ జాప్యం లేకుండా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో మౌఖిక పరీక్షలకు ఎంపిక చేయనున్నారు. వెబ్‌సైట్: https://portal-psc.ap.gov.in/