తిరుపతి జిల్లాలోని జీడీనెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీలో గ్రూపు రాజకీయాలు తీవ్రమవుతున్నాయని చర్చ నడుస్తోంది. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఆయన కుమార్తె కృపా లక్ష్మిపై వ్యతిరేక వర్గాలు ఏకమైనట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కృపా లక్ష్మి ఓటమి తర్వాత, ఇప్పుడు ఆమెను నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగించరాదని, కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. పాలసముద్రం మండలంలో జరిగిన రహస్య సమావేశంలో ఈ అంశాలపై చర్చించినట్లు చర్చ నుడుస్తోంది.