30న జీఎస్ఎల్‌వీ-ఎఫ్ 16 ప్రయోగం

AP: తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ఈ నెల 30న సా.5.40 గంటలకు జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్16 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. 2,392 కిలోల బరువున్న నిసార్ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఉపగ్రహాన్ని 98.40 డిగ్రీల వంపుతో భూమికి 743 కిలో మీటర్ల ఎత్తులోని సూర్య-సమకాలిక కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

సంబంధిత పోస్ట్