AP: కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ బండ్ల రుషికేశ్ (27) హరియాణాలోని పంచకులవేది టెక్నాలజీస్‌లో చేరిన పది రోజులకే దారుణ హత్యకు గురయ్యాడు. కంపెనీలో రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న అతడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ ఘటనతో గుడివాడలోని కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సమాచారం అందుకున్న గుడివాడ పోలీసులు కుటుంబ సభ్యులకు మరణవార్త తెలియజేయడంతో వారు హుటాహుటిన హరియాణాకు బయలుదేరారు.