AP: ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ ఇంచార్జి వ్యవహారశైలిపై గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చినా, ఆలూరు నియోజకవర్గంలో మాత్రం పార్టీ అధికారంలో లేనట్లే ఉందని వాల్మీకులు నిరుత్సాహంగా ఉన్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీనియర్ నేతలను కలుపుకొనిపోవడంలో ఆలూరు టీడీపీ విఫలమైందని గుమ్మనూరు జయరాం విమర్శించారు.