గుంటూరులో రోటరీ క్లబ్ ఆఫ్ గుంటూరు ఆధ్వర్యంలో జరిగిన ‘రోటోఫెస్ట్–2026’ ప్రారంభోత్సవంలో టీడీపీ యువ నాయకులు మాదల చైతన్య ఆదివారం పాల్గొన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తితో పాటు సామాజిక బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించాలని ఆయన అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని, సేవా కార్యక్రమాలు మానవతా విలువలను పెంచుతాయని రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ పేర్కొన్నారు. యువతను క్రీడలు, సామాజిక సేవ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.