హాన్సెన్ వ్యాధిపై విద్యార్థులకు అవగాహన సదస్సు

గుంటూరు నగరంలోని స్థానిక నల్లచెరువులో ఉన్న మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు హాన్సెన్ వ్యాధి (కుష్ఠు వ్యాధి)పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీపీఎంఓలు డాక్టర్ జోసఫ్ , డాక్టర్ నాగేశ్వరరావు నాయక్ పాల్గొని విద్యార్థులకు హాన్సెన్ వ్యాధి లక్షణాలు, నివారణ చర్యల గురించి వివరించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ శరీరంపై ఏ భాగంలోనైనా దురద, నొప్పి లేని తెల్లటి లేదా ఎర్రటి మచ్చలు, ఆ మచ్చలపై వెంట్రుకలు లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోలన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕