గుంటూరు: గాలిపటం ఇస్తానని బాలికపై అత్యాచారం

గుంటూరులో దారుణం చోటుచేసుకుంది. 4వ తరగతి చదువుతున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన యువకుడు గాలిపటం ఇస్తానని నమ్మించి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో అనుమానం వచ్చిన తల్లి నిలదీయగా అసలు విషయం బయటపడింది. బాధితురాలి తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, యువకుడిపై పోక్సో కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్