గుంటూరు: భార్య బంగారాన్ని బార్లో పోగొట్టిన భర్త..!

గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, పాతూరి రాధిక అనే మహిళ తన మూడు సవర్ల బంగారాన్ని పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో, ఆమె భర్త బంగారాన్ని జేబులో వేసుకొని బార్‌కు వెళ్లి, అక్కడ పోగొట్టుకున్నట్లు తేలింది. బార్ సిబ్బందికి బంగారం దొరకగా, వారు దానిని భద్రపరిచి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై పోలీసులు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

సంబంధిత పోస్ట్