గుంటూరులో గుర్రం జాషువా 131వ జయంతి సందర్భంగా డా. ఎం. స్వర్ణలతాదేవి, డా. ఎం. విజయశ్రీలకు జాషువా సాహితీ పురస్కారాలను ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వల్లం లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు, పేదరికం, మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యపరిచి ఉద్యమించడమే జాషువాకు అందించే నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జాషువా కల్చరల్ సెంటర్ ప్రతినిధులు, సాహితీవేత్తలు పాల్గొన్నారు.