గుంటూరులోని అంజుమాన్ హైస్కూల్లో గురువారం తల్లిదండ్రులు - ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ హయంలో విద్యారంగంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చేమన్నారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే పుస్తకాలను అందించారు.