గుంటూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ‘రోటోఫెస్ట్–2026’ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు మాదల చైతన్య ఆదివారం మాట్లాడుతూ యువతలో క్రీడా స్ఫూర్తితో పాటు సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించాలని అన్నారు. క్రీడలు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని తెలిపారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ కూడా యువతను క్రీడలు, సామాజిక సేవ వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.