గుంటూరు జిల్లాలో 5 ఏళ్లలోపు పిల్లలకు నిర్వహించిన పల్స్ పోలియో ఇమ్యూనైజేషన్‌లో 100.12 శాతం లక్ష్యం సాధించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కే విజయలక్ష్మి తెలిపారు. జిల్లాలో 1,50,637 మంది లక్ష్యంగా ఉండగా, 1,50,821 మందికి పోలియో చుక్కలు వేశారు. మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సిబ్బంది ఈ కార్యక్రమం నిర్వహిస్తారని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆమె వివరించారు.