గుంటూరులో కారులో ఉంచిన విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి. విజయవాడకు చెందిన ఆవుల ఆకాశ్ తన కుమార్తెను చూసేందుకు గుంటూరు వచ్చినప్పుడు, గుర్తుతెలియని వ్యక్తులు అతని కారు అద్దాలు పగలగొట్టి ఆపిల్ మ్యాక్‌బుక్ ల్యాప్‌టాప్, ఐప్యాడ్, ఆపిల్ పెన్సిల్, ముఖ్యమైన పత్రాలున్న బ్యాగ్‌ను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.