మంగళగిరి ఎమ్మెల్యే మంత్రి లోకేష్, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘన నివాళులర్పించారు. ఆదివారం ఎక్స్ వేదికగా ఆయన మాట్లాడుతూ, సామాజిక ప్రయోజనం కోసం నూతన ఒరవడితో రచనలు చేసి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువచ్చిన పద్మభూషణ్ గుర్రం జాషువా గారికి తెలుగు సాహిత్యానికి చేసిన సేవలను స్మరించుకుందామని తెలిపారు. ఆయన రచనలు సాహిత్య ప్రపంచంలో సంచలనం సృష్టించాయని కొనియాడారు.