ఉండవల్లిలో శనివారం జరిగిన సంఘటనలపై తాడేపల్లి పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. పెనుమాకకు చెందిన రైతు ఫిర్యాదుతో వైసీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. టీడీపీ నేతలు వైసీపీ నేతల కారు ధ్వంసం చేసినందుకు వారిపై కేసు నమోదైంది. విధుల్లో ఉన్న తాడేపల్లి సీఐని నెట్టినందుకు అంబటి రాంబాబుపై మరో కేసు నమోదైనట్లు సమాచారం.