వెంగళాయపాలెంలో భారీ చోరీ.. రూ. 8 లక్షల విలువైన సొత్తు చోరీ

గుంటూరు రూరల్ నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళాయపాలెం శ్రీశైలం కాలనీలో పులిపాక కోటేశ్వరరావు కుటుంబం విశాఖపట్నం వెళ్లిన సమయంలో ఇంట్లోకి చొరబడిన దుండగులు సుమారు రూ. 8 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులతో పాటు ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను దొంగిలించారు. బాధితులు తిరిగి వచ్చి చోరీని గుర్తించి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్