చేబ్రోలు కళాశాల విద్యార్థి సుమంత్ ఏఎన్‌యూ జట్టుకు ఎంపిక

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బేస్‌బాల్ పోటీల్లో చేబ్రోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి కె. సుమంత్ (I BA) ప్రతిభ కనబరిచి ఏఎన్‌యూ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ జె. లక్ష్మీకుమారి, ఎస్‌ఐ పి. శ్రీమన్నారాయణ, ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. బుజ్జిబాబు తదితరులు సుమంత్‌ను గురువారం సన్మానించి అభినందించారు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ పోటీలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్ LNCT విశ్వవిద్యాలయంలో జరగనున్నాయి. గుంటూరు, పొన్నూరులో జరిగిన ఈ పోటీల్లో సుమంత్ ఎంపికయ్యాడు. ఆల్ ఇండియా బేస్‌బాల్ పోటీలకు సుమంత్ ఎంపిక కావడం విశేషం.

సంబంధిత పోస్ట్

✕
✕