స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా పొన్నూరు మండలం పెదపాలెం గ్రామంలో వైసిపి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అంబటి మురళి కృష్ణ సూచనల మేరకు ప్రచారంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి డక్కుమల్ల రవి పాల్గొని జరగబోవు ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలో అభ్యర్థులను గెలిపించాలని గడపగడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో వైసిపి నాయకులతోపాటు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.