దేవాదాయ-ధర్మదాయ శాఖ మల్టీజోన్-2 ప్రాంతీయ సంయుక్త కమిషనర్ కే. బి. శ్రీనివాసరావు పదవీ విరమణ సభ గుంటూరులో బుధవారం ఘనంగా జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ మాట్లాడుతూ, జూనియర్ అసిస్టెంట్‌గా ప్రారంభించి ప్రాంతీయ సంయుక్త కమిషనర్ స్థాయికి ఎదిగిన శ్రీనివాసరావు ఉద్యోగులకు ఆదర్శమని అన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఆయన సేవలను ప్రశంసించి దుశ్శాలువాతో సన్మానించారు. అనంతరం దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు శ్రీనివాసరావుకు శుభాకాంక్షలు తెలిపారు.