గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని ములుకుదురు గ్రామంలో గురువారం ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామంలోని పలువురు లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1000 రూపాయల అదనంగా కలిపి ప్రతి లబ్ధిదారునికి రూ. 4వేల పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం దేశంలో కూటమి ప్రభుత్వమేనని ఆయన పేర్కొన్నారు. అర్హులందరికీ పెన్షన్ అందిస్తామన్నారు.