లబ్ధిదారులకు స్పౌజ్ పెన్షన్ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

గుంటూరు జిల్లా, పెదకాకాని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ నూతనంగా మంజూరైన స్పౌజ్ పెన్షన్ మంజూరు పత్రాలను 10 మంది లబ్ధిదారులకు అందజేశారు. నంబూరు, పెదకాకాని, వెంకటకృష్ణాపురం, తంగ్గెళ్లమూడి గ్రామాలకు చెందిన వారికి ఈ పత్రాలు అందించారు. నిరుపేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. జీవిత భాగస్వామిని కోల్పోయిన కుటుంబాలకు ఈ పెన్షన్ ఆర్థికంగా అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕