పెదకాకాని మండలంలోని గొల్లమూడి గ్రామానికి చెందిన నడింపల్లి రవికుమార్ పోలీస్ శాఖలో 43 ఏళ్ల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేశారు. కానిస్టేబుల్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి ఎస్‌ఐ స్థాయి వరకు వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. పదవీ విరమణ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ కుటుంబ సభ్యులను సన్మానించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.