4వ తారీఖు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పొన్నూరు రూరల్ మండల గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల నిఘాతో పాటు పోలీస్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు పొన్నూరు రూరల్ ఎస్సై బండ్లభార్గవ్ ఆదివారం తెలిపారు. ఎన్నికల సంఘం నిబంధన మేరకు 4వ తారీఖు ఫలితాల అనంతరం గ్రామాల్లో బహిరంగ ర్యాలీలు, బాణాసంచా, బైక్ ర్యాలీలు నిషేధించడమైనదని పేర్కొన్నారు.