రోడ్డుపై జారిపడ్డ మద్యం బాక్సులు

ప్రత్తిపాడు అంకమ్మగుడి సెంటర్ వద్ద సోమవారం స్పీడ్ బ్రేకర్ దాటుతుండగా అశోక్ లేలాండ్ వాహనం నుంచి మద్యం బాక్సులు రోడ్డుపై జారిపడ్డాయి. బీరు, మద్యం సీసాలు పగిలిపోవడంతో గాజు పెంకులు రోడ్డంతా వ్యాపించి ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరహరి ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డును శుభ్రం చేయించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్