తుళ్లూరులో ఘనంగా వినాయక నిమజ్జనం

తుళ్లూరు మండలం తుళ్ళూరు గ్రామంలో శ్రీ కోదండరామ స్వామి వారి దేవస్థానం, బాలకోటయ్య సత్రం, గీత మందిరం వద్ద గణనాధుల నిమజ్జనం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. డీజే, సాంప్రదాయ వాయిద్యాలు, మేళతాళాలు, తప్పెట్లు, అమ్మవారి వేషాలు, చిత్ర విచిత్రమైన రాక్షస వేషాలతో ప్రజలకు ఆహ్లాదాన్ని పంచారు. కోదండరామ స్వామి దేవస్థానం వద్ద వినాయకుడి లడ్డూ వేలంపాట 3.16 లక్షల రూపాయలకు జరిగింది. గణపతులు కొలువై ఉన్న రథాలు పూల పందిరి, అశ్వ వాహనాలతో ఆకట్టుకున్నాయి. నిమజ్జన కార్యక్రమంలో అన్న ప్రసాదం కూడా అందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕