ఫిరంగిపురంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారు డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని, క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.