తుళ్లూరులో కుండపోత.. ఎండ నుంచి ఉపశమనం, కార్మికులకు ఇబ్బందులు

తుళ్లూరు మండలంలో ఆదివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలకు వర్షం కొంత ఉపశమనం కలిగించింది. అయితే, సెలవు రోజు కావడంతో నిత్యావసర వస్తువుల కొనుగోలుకు తుళ్లూరుకు వచ్చిన అమరావతి ప్రాంత నిర్మాణ కార్మికులు వర్షం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు ప్రాంతాల్లో రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో రాకపోకలు కూడా మందగించాయి.

సంబంధిత పోస్ట్