పెండింగ్ జీతాల కోసం ఖాళీ జోలలతో 'దేహి' అంటున్న కార్మికులు..

రెండు నెలలుగా జీతాలు అందకపోవడంతో తుళ్లూరులో రాజధాని పారిశుద్ధ్య కార్మికులు ఆదివారం రెండో రోజు కూడా ఖాళీ జోళ్లు, కంచాలతో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. కార్మిక సంఘం అధ్యక్షుడు ఎం. రవి మాట్లాడుతూ ఏజెన్సీ, సీఆర్డీఏ అధికారులు బాధ్యతలను ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారని ఆరోపించారు. సెలవు రోజుల్లోనూ పనిచేయిస్తున్నా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయి వేతనాలు విడుదల చేయాలని, లేదంటే కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్