వృద్ధుడిపై దాడి కేసు హత్యగా మార్పు: పోలీసులు

తెనాలి నందులపేట ఈటీ కాలనీకి చెందిన గాదె ఏసయ్య (63)పై గత నెల 15న జరిగిన దాడి ఘటన విషాదాంతమైంది. రత్నా టాకీస్‌ రైతు బజారు నుంచి హోటళ్లకు కూరగాయలు సరఫరా చేసే ఏసయ్యపై బుర్రిపాలెం రోడ్డులోని హోటల్ కార్మికుడు షేక్ రహీమ్ దాడి చేసినట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరుకున్న ఏసయ్యను తెనాలి జిల్లా వైద్యశాలకు, అనంతరం గుంటూరుకు తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసిన సమయంలో జ్ఞాపకశక్తి కోల్పోయినట్లు వైద్యులు సూచించగా, ఇంట్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మొదట దాడి కేసుగా నమోదైన ఘటనను పోలీసులు హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్