తెనాలిలోని పినపాడు గ్యాస్ గోడౌన్ నుంచి ఆలపాటి నగర్కు వెళ్లే రహదారి కొబ్బరి బోండాల వ్యర్థాలతో డంపింగ్ యార్డుగా మారిపోయింది. వ్యాపారస్తులు రోడ్లపై పారేస్తున్న బోండాల వల్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వ్యర్థాలను తొలగించాలని కోరుతున్నారు.