అన్నవరం హనుమాన్ పాలెంలో పొలం పిలుస్తుంది

కొల్లిపర మండలం అన్నవరం హనుమాన్ పాలెం గ్రామాలలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి ఎన్ శ్రీనివాస్ రెడ్డి వరి పంట పొలాలను పరిశీలించారు. అనంతరం రైతులతో సమావేశమై నీటి యాజమాన్యం పై అవగాహన కల్పించారు. వారిలో పిలకలు చేసే దశ అలాగే చిరు పొట్ట దశలో నీటి ఆవశ్యకత ఎక్కువగా ఉంటుందని ఈ దశలో నీరు పంటకు అందించేలా చూసుకోవాలని అన్నారు. ఈ క్రమంలో స్వల్పంగా ఆకు చుట్టు పురుగు కనిపిస్తుందని తెలియజేశారు. నివారణ చర్యలు గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యూష, రైతులు తదితరులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్

✕
✕