మైలవరం ZPHS విద్యార్థులకు 162 సైకిళ్లు పంపిణీ

బాపట్ల జిల్లా, అద్దంకి మండలం, మైలవరం ZPHS పాఠశాల విద్యార్థులకు సోమవారం రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్వచ్ఛంద సంస్థల సహకారంతో 162 సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులు చదువులో శ్రద్ధతో పాటు క్రీడలు, పాఠశాల కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని మానసిక ధైర్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్