అద్దంకి: గంజాయి నిందితులను కఠినంగా శిక్షించాలి

నెల్లూరులో ప్రజానాట్యమండలి కళాకారుడు పెంచలయ్యను మాఫియా ముఠా పట్టపగలే హత్య చేసి చంపడం దుర్మార్గమని అద్దంకి నందమూరి కళాపరిషత్ అధ్యక్షులు మనం త్రిమూర్తులు సోమవారం తెలిపారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పెంచలయ్య ప్రజలను చైతన్య పరుస్తున్నాడని అక్కస్సుతో, తన బిడ్డలను స్కూల్ నుండి బైక్ పై ఇంటికి తీసుకు వస్తున్న క్రమంలో గంజాయి మాఫియా అతి కిరాతకంగా కత్తిపోట్లతో చంపిందని ఆయన ఆరోపించారు. చట్టం వీరిని కఠినంగా శిక్షించాలని త్రిమూర్తులు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్