అద్దంకిలోని సర్కిల్ పోలీస్ స్టేషన్ నందు సిఐ సుబ్బరాజు గురువారం బ్యాంక్ మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. బ్యాంకు మరియు ఏటీఎంలోఏటీఎంల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సిఐ వారికి సూచించారు. ముఖ్యంగా వాచ్మెన్ ను ఏర్పాటు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. బ్యాంకు నందు భద్రత నిఘా ను కట్టుదిట్టం చేసుకోవాలని సీఐ సుబ్బరాజు తెలియజేశారు. అపరిచిత వ్యక్తులను జాగ్రత్తగా గమనించాలని తెలిపారు.