అద్దంకి మండలం సింగరకొండ పాలెం గ్రామంలో గురువారం డి ఎల్ డి వో పద్మావతి ఎండిఓ సింగయ్య తో కలిసి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య పనులను ఆమె పరిశీలించారు. ప్రతిరోజు రోడ్ల వెంబడి చెత్తను గుర్తించి వెంటనే తొలగించాలని ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఎక్కడ చెత్త నిలువ ఉండకూడదని సూచించారు. పారిశుధ్యం పట్ల కలెక్టర్ సీరియస్ గా ఉన్నట్లు చెప్పారు.