అద్దంకి ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను గురువారం అమరావతిలో నియోజకవర్గానికి చెందిన డాక్టర్ సాయి తేజ, డాక్టర్ ప్రదీప్ లు కలిసి ఫిబ్రవరి 4వ తేదీన గుంటూరులో అమరావతి రోడ్డు నందు స్వస్థ హాస్పిటల్ నూతన ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. ఈ సందర్భంగా స్వస్థ హాస్పిటల్ లో అందించే సేవలు గురించి డాక్టర్ సాయి తేజ మంత్రి రవికుమార్ కు వివరించారు. హాస్పటల్ ఓపెనింగ్ కు తప్పకుండా వస్తానని మంత్రి వారికి హామీ ఇచ్చారు.