అద్దంకి: ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. కేసు నమోదు

అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్ కు చెందిన వెంకట్రావు తనకు విద్యుత్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి గుంటూరు జిల్లాకు చెందిన గోపి అనే వ్యక్తి 5. 26 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు బుధవారం రాత్రి కేసు నమోదు అయినట్లు సీఐ సుబ్బరాజు తెలిపారు. గతంలో మధ్యవర్తుల ద్వారా రాజీ చేసుకోగా లక్ష రూపాయలు ఇచ్చాడని తర్వాత అతని ఆచూకీ లేదని బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్