అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీపీ జ్యోతి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం అరగంట ఆలస్యంగా మొదలైంది. వివిధ శాఖల అధికారులు తమ పాలన పురోగతిని వివరించారు. అయితే, కొంతమంది అధికారులు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం సమావేశంలో చర్చనీయాంశమైంది. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపిటిసిలు పాల్గొన్నారు.