అద్దంకిలోని భవిత కేంద్రం నందు విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన వినికిడి యంత్రాలు, ట్రై సైకిళ్లు పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల డిప్యూటీ డీఈవో గంగాధర్ పాల్గొని విద్యార్థులకు వాటిని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక సౌకర్యాలు కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులు వీటిని ఉపయోగించుకొని మెరుగ్గా చదవాలని సూచించారు.