అద్దంకి మున్సిపాలిటీ, మున్సిపల్ కమిషనర్ డి. రవీంద్ర సారథ్యంలో పన్నుల వసూళ్లలో జిల్లాలోనే ప్రథమ స్థానాన్ని, వరుసగా రెండవసారి రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానాన్ని సాధించి అరుదైన ఘనతను అందుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆస్తి పన్ను వసూళ్లలో ఈ విజయం సాధించింది. ఈ సందర్భంగా సోమవారం ప్రిన్సిపల్ సెక్రెటరీ సురేష్ కుమార్ చేతుల మీదుగా మున్సిపల్ కమిషనర్ రవీంద్ర ఉత్తమ అవార్డును అందుకున్నారు.