అద్దంకి: డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.1.23 కోట్లు దోచేశారు

అద్దంకిలో సైబర్ నేరగాళ్లు సీబీఐ పేరు చెప్పి ఒక రిటైర్డ్ ఉద్యోగిని మోసం చేశారు. మనీ లాండరింగ్ కేసులో సుప్రీంకోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిందని, బెయిల్ కోసం డబ్బులు చెల్లించాలని చెప్పి, మూడు వారాల క్రితం నాగేశ్వరరావు అనే వ్యక్తి వద్ద నుంచి రూ.1.23 కోట్లు కాజేశారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు అద్దంకి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

సంబంధిత పోస్ట్