అద్దంకి నియోజకవర్గ వైయస్సార్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం తాడేపల్లిలో ఆయా మండలాల వైసీపీ నేతలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో చేపట్టిన పార్టీ కార్యక్రమాలు, జనంలోకి తీసుకువెళ్లిన ప్రభుత్వ వైఫల్యాలను వారు జగన్ కు వివరించారు. కార్యకర్తలందరికీ అందుబాటులో ఉండాలని, వారి కుటుంబాలకు అండగా ఉండాలని జగన్మోహన్ రెడ్డి వారికి సూచించారు. అందరూ కలిసికట్టుగా ముందుకు పోవాలని ఆయన చెప్పారు.